ప్రభాస్ ‘ఒక్క అడుగు’కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ‘మిర్చి' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రానికి కమిటైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మేరకు సినిమాలో తన పాత్రకు విధంగా తన రూపాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ‘బాహుబలి' మూవీ ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం పూర్తయి ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మరో రెండేళ్ల వరకు ప్రభాస్ మూవీ రాదా? అంటూ ఆందోళనలో ఉన్న అభిమానులకు, ప్రభాస్ త్వరలో ‘ఒక్క అడుగు' సినిమా చేయబోతున్నారనే వార్త కాస్త ఊరటనిచ్చింది. తాజాగా రాజమౌళి కూడా ఈ సినిమా చేయడానికి ప్రభాస్‌కు వెసులు బాటు కల్పించాడని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత తర్వగా ఒక్క అడుగు మూవీ పూర్తి చేసి మళ్లీ ‘బాహుబలి' షూటింగులో బిజీ కానున్నాడు ప్రభాస్. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఒక్క అడుగు' చిత్రం కృష్ణం రాజు దర్శకత్వంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. కృష్ణం రాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాకు ముందు ఒక్క అడుగు లాంటి సినిమాలు రావడం ప్లస్సవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు

0 comments: