'బాహుబలి' కి పోలీసుల సాయం {హాట్ టాపిక్ }

ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో గుర్రాల స్వారికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నేపధ్యంలో రాజమౌళి పోలీసుల సాయిం తీసుకోనున్నారని సమచారం. ఈ మేరకు ఆంగ్ల దినపత్రికలలో కథనాలు వెలువడుతున్నాయి. దగ్గుపాటి రానా ... గుర్రపు స్వారీ చేస్తూ పడి దెబ్బలు తగుల్చుకోవటంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. ప్రొఫెషినల్ హార్స్ రైడర్స్ అయితే మంచిదనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ డిపార్టమెంట్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ ఈ విషయమై పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ... మరింత ఖచ్చితమైన అవుట్ పుట్ కోసం ప్రొఫెషనల్ అవసరం ఉందనే విషయం రాజమౌళి గ్రహించారని, సినిమాని ఓ రేంజికి తీసుకు వెళ్లాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని, పోలీసులు లభ్యం కాకపోతే మరింత ప్రొఫెషనల్స్ ని వెతుకుతారని సిని వర్గాల భోగట్టా.

0 comments: